
టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో శ్రీమతి సోనియా గాంధీ,శ్రీ రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈ.డి కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి పాల్గొన్నారు..
ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
