Spread the love

ఐదో వార్డు ఇంద్ర కాలనీ ఎర్రకుంట లో మురికి నీటి నిల్వను తొలగించిన మున్సిపల్ అధికారులు

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు బాలానగర్ ఇందిరా కాలనీలో ఉన్న ఎర్రకుంట లో చెత్తాచెదారంతో నిండుకోవడంతో మురికి నీరు నిలిచిపోయి కాలనీలు మురుగు దుర్వాసనతో వార్డుప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈర పోగు శ్రీనివాసులు మరికొందరు కాలనీవాసులు విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ ఇనిస్పెక్టర్లు మున్సిపల్ జవాన్లను పంపించి జెసిపి సహాయం ద్వారా మురికి నీరు వెళ్లేందుకు అడ్డుపడిన చెత్తాచెదారం కంప చెట్లను తొలగించి నిల్వ ఉన్న మురికి నీటిని నల్ల చెరువులోకి వదలి కాలువను శుభ్రం చేయడం జరిగిందని వారు తెలిపారు

గతంలో ఎర్రకుంట మురికి నీటి నిలువపై పలమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డికి కూడా మెమొరండం సమర్పించడం జరిగిందని కాలువ నిర్మాణం కోసం ఎమ్మెల్యే పూజ చేయడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు కాలనీవాసులు తెలిపారు అంతవరకు ఇలాంటి పరిస్థితి తప్పదని తెలియజేశారు సమాచారం ఇచ్చిన వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మురికి నీటి తొలగింపు చేయడం పట్ల కాలనీవాసులు వారికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గంధం బాలు ఈర పోగు ఆంజనేయులు గోర్ల గోవిందమ్మ బొడ్డుపల్లి కొండన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు