Spread the love

సొంతంగా 20 లక్షలు వెచ్చించి విద్యార్థులకు డిజిటల్ పుస్తకాల పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

వనపర్తి

దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి తను సొంతంగా 20 లక్షలు వెచ్చించి దేవరకద్ర నియోజక వర్గంలోని ZPHS స్కూళ్లలో మోడల్ డిజిటల్ పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరిగింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని కొన్నూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పారిశ్రామికవేత్త ఏ శరత్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వారి చేతుల మీదుగా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కొన్నూర్ హెడ్మాస్టర్ టి నాగరాజు మరియు ఉపాధ్యాయ బృందం అలాగే మదనాపురం మండలం వైస్ ప్రెసిడెంట్ భాస్కరాచారి కొన్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏ సతీష్ రెడ్డి గంటల వెంకటరామి రెడ్డి బాదం వెంకటస్వామి నరేందర్ రెడ్డి పుట్ట కురుమన్న కొంటి సత్యం మాజీ సర్పంచ్ జగన్ మాజీ ఉపసర్పంచ్ రఘునాథ్ రెడ్డి కొండ శివారెడ్డి యూత్ అధ్యక్షులు జి నవీన్ రెడ్డి రైతు అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి కృపందర్ రెడ్డి నీల మన్యం బి తిరుప తయ్య సయ్యద్ రఫిక్ కాల్వకాడి రవి నాయని వాసు బుగ్గపల్లి గోపాల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.