TEJA NEWS

మంత్రి గొట్టిపాటి చేతుల మీదుగా విద్యార్థులకు 452 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేసిన అసిస్ట్

మేదరమెట్ల:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మేదరమెట్ల ZPH ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా 452 సైకిళ్లను పంపిణీ చేశారు. MYTWO ఫండ్, మైరియడ్ (Myriad), మేఘా కంపెనీ (Megha Company), మరియు SEIL కంపెనీల సహకారంతో ఈ సైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలకు సుదూరం నుంచి రావడానికి పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ సైకిళ్లు ఎంతగాన ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి, DEO పురుషోత్తం, Dy DEO గంగాధర్,పాఠశాలప్రధానోపాధ్యాయురాలు అంజనాదేవి, అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్లు జె. కృష్ణ హరీష్, విష్ణుప్రియ, కోఆర్డినేటర్ డేవిడ్, మేలుకొలుపు సిబ్బంది, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.