
ఏపీయూడబ్ల్యూజే ,ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు లస్సీ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
చిలకలూరిపేట : స్థానిక కళా మందిర సెంటర్ లో ఉన్న గాంధీ పార్క్ ఆవరణలోడివిజన్ 2 శానిటేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో లస్సీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్, శానిటరీ ఇనస్పెక్టర్ సునీత లు పారిశుధ్య కార్మికులకు లస్సీ,మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపుమేరకే లస్సి పంపిణీ
ఈ సందర్భంగా అడపా అశోక్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మేరకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ కార్యక్రమలలో భాగంగా , పట్టణాలను శుభ్రంగా ఉంచడానికి నిరంతరం కృషి చేసే ,పారిశుధ్య కార్మికులుసమాజానికిఒకవెలకట్టలేనిసేవలనుఅందిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు బయట పని చేస్తారు. వేసవిలో వారి పని మరింత కష్టసాధ్యం అవుతుంది. అందువల్ల, వారికి చల్లని లస్సీ ప్యాకెట్లను పంపిణీ చేయడం ద్వారా వారిని తాగునీటితోపాటు,చల్లదనంఅందించడంసాధ్యమవుతుందనీ,పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం సామాజిక బాధ్యతను గుర్తించడానికీ, వారి కష్టాలను కాస్త ఊరట కలిగించేందుకు, ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగిందని ఈ పంపిణీ ద్వారా పారిశుధ్య కార్మికులకు వేసవిలో చల్లదనం, ఆశ్రయం లభించడమే కాకుండా, వారి పనితీరులో మరింత ప్రోత్సాహం లభిస్తుంది అంతేకాకుండాపారిశుధ్య కార్మికులకు వేసవిలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం ద్వారా వారు డీహైడ్రేషన్ మరియు వేడి సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందినీ ఆయన తెలిపారు.
తోట మల్లికార్జునరావు మాట్లాడుతూ
తోట మల్లి కార్జున్ రావు మాట్లాడుతూవేసవిలో పారిశుధ్య కార్మికులకు లస్సి పంపిణీ చేయడం ద్వారా వారిని రక్షించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం ఈ పంపిణీ వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదపడుతుందనీ,సమాజం పారిశుధ్య కార్మికులకు సహాయం చేయడం మరియు వారి పనిని గౌరవించడం చాలా ముఖ్యం వారిని గౌరవించడం ద్వారా వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారనీ పేర్కొన్నారు.
శానిటరీ ఇనస్పెక్టర్ సునీత మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శానిటరీ ఇనస్పెక్టర్ సునీత మాట్లాడుతూపారిశుధ్య కార్మికులు సమాజానికి చేసే సేవలను గుర్తించి,వేసవిలో వారు ఎదుర్కొనే వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట యూనియన్ సభ్యులకు, అధ్యక్షులు అడపా అశోక్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సెక్రటరీ షేక్ దరియా వలి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొచ్చర్ల చందు, జాయింట్ సెక్రెటరీ సుందర్ బాబు, కొండెపాటిరమేష్, పెనుమల మనోహర్, కొనికి సాంబశివరావు, అమ్మనబ్రోలు శివనారాయణ, రావిపాటి రాజా,శానిటేషన్ మేస్త్రీలు బైరా సతీష్,బాలాజి సింగ్,రమేష్,నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
