
రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఘనత – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఉగాది కానుకగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకంలో భాగంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ మరియు మొగులమ్మ కాలనీలోని ఉన్న ఛౌక ధరల దుకాణాలలో అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందుతుందని అన్నారు. రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రేషన్ కార్డ్ లోఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం తీసుకోవచ్చని తెలియచేసారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, CH.భాస్కర్, యాదగిరి, బాలస్వామి, మహేష్, ఫారూఖ్, ఖలీమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
