
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌక దారుల దుకాణంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి సూచనల మేరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయి నగర్ చౌక దారుల దుకాణలలో పేద ప్రజల కోసం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి సన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ రఫీయా బేగమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ జీవన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ (లడ్డు), మల్లికార్జున్, మెడ శ్రీను, శ్రీనివాస్, రహీమ్, సంజీవ , మిట్టు పాల్గొన్నారు.
