
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అవినీతిపై విచారణ చేపట్టాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన………. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
చర్యలు కొరవడితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు
- నిర్లక్ష్యం వహిస్తేఢిల్లీ డి. ఓ. పి.టి లో కలెక్టర్ పై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
-
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనఅవినీతి అక్రమాలపై విచారణ చేసిచర్యలు చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం అని ఆధారాలతో సహా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం రాచాల మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న బీరం సుబ్బారెడ్డి బీసీ వెల్ఫేర్ కోసం నిర్మించిన భవనాన్ని వైటిసి ట్రైనింగ్ సెంటర్ కు అద్దెకు ఇవ్వడం జరిగిందని దాని అదే నెలకు 50,000 చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ అవుతా ఉంటే బీరం సుబ్బారెడ్డి వాటిని దాదాపుగా 16 లక్షల తన సొంతానికి వాడుకోవడం జరిగిందనిఅలాగే జిల్లాలోని బీసీ వెల్ఫేర్ తో పాటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో కూడా ఆయన ఇన్చార్జిగా పనిచేయడం జరుగుతుందని ఎస్ టి కార్పొరేషన్ లో దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులు బీసీ వెల్ఫేర్ 1700 మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రభుత్వం వీరికి కాస్మోటిక్ చార్జీల పేరుతో బిసి వెల్ఫేర్ ద్వారా కాస్పాటిక్ చార్జీలు 78000 ఎస్టీ వెల్ఫేర్ ద్వారా 50,000 మొత్తం కలిపి 1,28,000 వస్తే ఈ అధికారి కాజేస్తా ఉన్నాడని అలాగే హాస్టల్లో పనిచేసి వంట మనుషులు డ్రైవర్లను ఇతర సిబ్బందిని కలెక్టరేట్ లోని ఇతర అధికారుల ఇండ్ల వద్ద పని చేయించుకుంటూ జీతమేమో ప్రభుత్వం వద్ద తీసుకుంటున్నారని ఈ తంతంతా అందరికీ తెలిసే జరుగుతుందని ఆరోపించారు - బీరం సుబ్బారెడ్డి గతంలో పనిచేసిన వద్ద ఏసీబీ దాడులు జరిగాయని అవినీతి ఆరోపణల పై అక్కడ సస్పెండ్ కావడం జరిగిందని అక్రమ ప్రమోషన్ తో ఈ జిల్లాకు రావడం జరిగిందని ఇక్కడ కూడా ఆయన పనితీరు అలాగే కొనసాగుతోందని కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి సదరు అధికారిని రేపటిలోగా సస్పెండ్ చేసిఅవినీతిపై విచారణ చేపట్టాలని లేని పక్షంలో జిల్లాలోని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సివిల్ సప్లై బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ఇలా అన్ని శాఖల అధికారుల పరిస్థితి ఇలాగే ఉందని ఇదంతా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందన పర్యవేక్షణ కొరవడితే ఢిల్లీలోని డి.ఓ.పి.టిలో కలెక్టర్ పై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య యాదవ్ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ ఆర్టిఐ విభాగం అధ్యక్షులు గుర్రం రాఘవేందర్ కొత్తకోట మండల అధ్యక్షులు అంజన్న యాదవ్ ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కెల మల్లేష్ గౌడ్ దేవర శివ చెలిమిల్ల రామన్ గౌడ్ కిరణ్ వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు
