Spread the love

జిల్లా పోలీసు విభాగం DAR(డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్) నందు పనిచేస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్.,

పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు (28.02.2025) పదవి విరమణ సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగ విరమణ చేసిన AR HC 469 బాల. బ్రహ్మానంద రెడ్డి ని వారి కుటుంబ సభ్యులతో కలిపి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., సాలువ కప్పి ఘనముగా సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీమాట్లాడుతూ… పోలీస్ డిపార్ట్మెంట్ కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడినారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లుఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు. మరియు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ అవసరం ఉన్నా సరే స్వయంగా వచ్చి తనను కలవచ్చని భరోసా ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు AR అడిషనల్ ఎస్పీ V. సత్తి రాజు ,AR డి.ఎస్.పి మహాత్మా గాంధీ రెడ్డి , ఆర్ఐ వెల్ఫేర్ L.గోపీనాథ్ , AO K.V.V రామారావు , మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ T.మాణిక్యాల రావు పాల్గొన్నారు.