
జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటి మరియు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా మాజీ సర్పంచ్ జిల్లెల్ల రాములు *
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జిల్లెల్ల రాములకను ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి మరియు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించారు. ఈ సందర్బంగా జిల్లెల్ల రాములు ప్రభుత్వం తన పై నమ్మకం ఉంచి తననియమాకానికి సహకరించిన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి కి హైదరాబాదులో వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞత తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన పై నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఎస్సీ ఎస్టీలకు తగు న్యాయం చేస్తానని జిల్లెల్ల రాములు అన్నారు.ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మాజీ సభ్యులు బాలాజీ సింగ్,కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, మాజీ కౌన్సిలర్స్ గోరటి శ్రీను,చిన్న రాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, షానవాజ్, మాజీ సర్పంచ్ లు దామోదర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ నాయక్, హరిశ్వర్ రెడ్డి, రవిగౌడ్, కురమిద్ద రవి, భాస్కర్,చంద్ర కాంత్, వెంకటేష్, సురేష్, పరుశరామ్ తదితరులు పాల్గొన్నారు.
