
ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దు
** తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య
తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ఎవ్వరు అలసత్వం వహించరాదని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా ఐదు మంది తమ సమస్యలు తెలుపగా, 23 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మునిసిపల్ పార్క్ వెనుక ప్రాంతంలో చెత్త వాహనం సక్రమంగా వచ్చేలా చూడాలని, పూల మార్కెట్, సున్నపు వీధిలో ఆక్రమణలు తొలగించాలని, రాజీవ్ నగర్ లోని మసీదు వద్ద నీటి వసతి కల్పించి, మొక్కలు నాటించాలని, చేపల మార్కెట్ వద్ద శుభ్రంగా ఉంచాలని, కొంకచెన్నాయ గుంటలో అక్రమంగా వేసిన యుడిఎస్ తొలగించాలని, వరదరాజ నగర్ పాచిగుంట వద్ద సక్రమంగా నీరు రావడం లేదని, గతంలో ఇంటికోసం డబ్బులు కట్టామని ఇళ్ళైనా, డబ్బులు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డిఈలు, ఏసిపిలు, తదితరులు ఉన్నారు.
