TEJA NEWS

మర్రిచెట్టు బాలాంజనేయ స్వామి గుడి అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన 22 వ వార్డు నాయకులు మెకానిక్ శ్రీను
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వ వార్డు శ్వేతా నగర్ లోని మర్రి చెట్టు బాల ఆంజనేయ స్వామి ధ్వజస్థంబ మరియు నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవా కార్యక్రమంలో 22వ వార్డు నాయకులు మెకానిక్ శ్రీను. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నవగ్రహల పూజ లో పాల్గొన్న అనంతరం ధ్వజస్తంభ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి పాలుపంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెకానిక్ శ్రీనుని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మెకానిక్ శ్రీను మర్రిచెట్టు బాల ఆంజనేయ గుడి అభివృద్ధి కోసం 100000/- ఒక్క లక్ష రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు.