
దాతల సహకారం మరువలేనిది
గురజాల : సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు.గురజాల శ్రీ పాత పాటమ్మ అమ్మ వారి దేవాలయంలో వచ్చు భక్తులకు, వృద్ధులకు, అనాధలకు, యాచకులకు, స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాస్తవ్యులు నవభారత్ మెడికల్ షాప్ కావూరి శంకర్రావు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ,
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ భీమరాజు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ పౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి, , స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
