దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల దాహార్తి తీర్చాలి : ప్రత్తిపాటి
చిలకలూరిపేట: మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు దాతలు, స్వచ్ఛందసంస్థలు మంచినీటి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు సేవచేయడాన్ని ఒక భాద్యతగా భావించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని అడ్డరోడ్డు, కళామందిర్ కూడలిలో ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక మున్సిపాలిటీ వారు ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాలను ప్రత్తిపాటి ప్రారంభించారు. వేసవికాలం ముగిసేవరకు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ఆయన మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. తాగునీటిని వృథా చేయకుండా, ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రభుత్వం సూచించిన విధంగా పట్టణంలో సంచరించే మూగజీవాలకు కూడా తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, వేసవితాపం నుంచి వాటి ప్రాణాలను కాపాడాలని ప్రత్తిపాటి అధికారుల్ని అదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డి.ఈ రహీం, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ నాయకులు టీడీపీ కరీముల్లా, గంగా శ్రీనివాసరావు, తోట సత్యం, అరికట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
