అశ్రద్ధ వద్దు ప్రతి ఓటు కీలకమే మాజీ మంత్రి నల్లపరెడ్డి

TEJA NEWS

అశ్రద్ధ వద్దు ప్రతి ఓటు కీలకమే మాజీ మంత్రి నల్లపరెడ్డి

” యస్ ఐ ఆర్ ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవూరు నియోజకవర్గ యస్ ఐ ఆర్ పరివేక్షణ కమిటీ’ కోవూరు నియోజకవర్గం, కోవూరు మండలం (బి ఎల్ ఏ) లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (యస్ ఐ ఆర్ ) మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి ,వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు యస్ ఐ ఆర్ పరివేక్షణ కమిటీ సభ్యులు, యస్ ఐ ఆర్ లీగల్ కమిటీ సభ్యులు.వారుమాట్లాడుతూ.రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు బి ఎల్ ఏ ఎస్ పూర్తి అవగాహన కలిగి ఉండాలి, దీనిని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి.

ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా సాంకేతికంగా పాత ఓటర్ల వివరాలన్నీ తొలగించబడి, జాబితా “శూన్యం” అవుతుంది.రాష్ట్రంలోని సుమారు 4 కోట్ల పైచిలుకు ఓట్లకు సంబంధించి సరికొత్త ప్రక్రియ ప్రారంభం కానుంది.గతంలో ఓటు ఉందనో, ఐడెంటిటీ కార్డు ఉందనో ఎవరూ అశ్రద్ధ వహించకూడదు. నా ఓటు ఎక్కడికి పోతుంది అనే ధీమాతో ఉంటే నష్టపోతారుఅని అన్నారు.ఈ సమావేశంలో.వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, ఏపీ డీఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జిల్లా బూత్ కమిటీల ఇన్చార్జ్ బలిరెడ్డి సుధాకర్ రెడ్డి, కోడూరు మధుసూదన్ రెడ్డి, మల్లు జయరామయ్య, కొట్టే మల్లికార్జున,మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇంచార్జ్ కొండూరు లక్ష్మీ నారాయణరెడ్డి, నిలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, ఎరటపల్లి మీరారెడ్డి మరియు ఎస్ ఐ ఆర్ లీగల్ కమిటీ సభ్యులు మరియు వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top