
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన కూటమి నాయకులు
దాచేపల్లి
*భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర్య భారతదేశ మొదటి న్యాయ శాఖా మంత్రి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా దాచేపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన దాచేపల్లి పట్టణం, టీడీపీ కూటమి నాయకులు. ఈ సందర్బంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడలలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత సోదరులు, కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు.
