TEJA NEWS

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం డాక్టర్ జగ్జీవన్ రామ్ భవన్ లో దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతు బాబూజీ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు.భారత అత్యున్నత ఉప ప్రధాని పదవిని అధిష్టించిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు..ఆ గొప్ప యోధుడికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ చైర్మన్ డాక్టర్ అవిజ జేమ్స్,130 డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్య నారాయణ , 130 డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మరియు దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు, నాయకులతో పాల్గొన్నారు..