
తిరుమలకుంట గ్రామంలో డా. బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామం
అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి..
తిరుమలకుంటలో ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు…
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట పంచాయతీలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆయన ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవ మన్నరు. వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారానే మనం రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. సిద్దెల రాము, కొత్తపల్లి సీతారాములు, గొల్లమందల పవన్ కళ్యాణ్, మొటూరి రమేష్, ములకలపల్లి కిషోర్,పల్లెల రామలక్ష్మయ్య, జుజ్జురి వెంకన్నబాబు, పరికిలా రాంబాబు, సంకా పూర్ణం, కోర్స నాగులు, పొట్టా వెంకన్న, పానుగంటి శ్రీను, బుర్ర బాబు, గడ్డం యేసు, తలగాని చిట్టిబాబు, కొనకళ్ళ లక్ష్మణ్ రావు తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
