
యువతకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ముస్తాక్ అహ్మద్
- రంజాన్ పండుగ సందర్భంగా పలు ముస్లిం కుటుంబాలకు కిట్లు పంపిణీ : హమీద్ షేక్
మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రఖ్యాత చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ ముస్తాక్ అహ్మద్ యువతకు స్ఫూర్తి ప్రదాత అని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కొనియాడారు. పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసేందుకు డాక్టర్ ముస్తాక్ అహ్మద్ ముందుకొచ్చారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో హమీద్ షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో మానవతా దృక్పథంతో పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను అందజేసిన డాక్టర్ ముస్తాక్ అహ్మద్ సేవలు అద్వితీయమని హమీద్ షేక్ కొనియాడారు. రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదరసోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొవాలని, ప్రతీ ఒక్కరిపై అల్లా అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాసర్, నసీర్, తదితరులు పాల్గొన్నారు
