
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు డి ఆర్ ఎన్ ఎస్ విద్యార్థి
చిలకలూరిపేట : స్థానిక డి ఆర్ ఎన్ ఎస్ సి వి ఎస్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న డి రాజా రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరా సుజాత తెలిపారు . ఇటీవల జరిగిన పల్నాడు జిల్లా ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబరచటం వలన పల్నాడు జిల్లా జట్టుకు ఎంపిక చేశారని , ఈనెల 12 నుండి అనంతపురం జిల్లా కదిరి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు . ఈ కార్యక్రమంలో విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ళ సుబ్బారావు , ఉపాధ్యక్షులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు , సెక్రెటరీ ఎం శివానంద కుమార్ , జాయింట్ సెక్రెటరీ బేతంచెర్ల కోటేశ్వరరావు , ట్రెజరర్ బచ్చు రామలింగేశ్వర రావు , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరా సుజాత విద్యార్థి డి రాజా, పిడి ప్రవీణ్ ను అభినందించారు .
