TEJA NEWS

నేరాల అదుపులో డ్రోన్ టెక్నాల‌జీ

వినూత్న టెక్నాలజీ ప్రవేశ పెడుతున్న చిలకలూరిపేట పోలీస్ లు

బైపాస్ రోడ్డుపై డ్రోన్ ను ప‌రిశీలించిన అర్బ‌న్ సీఐ పి ర‌మేష్

చిల‌క‌లూరిపేట‌:అంది వ‌స్తున్న సాంకేతిక ప‌రిజ్ఞాన్ని వినియోగించుకొని పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌లను ప‌రిరక్షించాల‌ని అర్బ‌న్ సీఐ పి ర‌మేష్ కోరారు.

పోలీసు శాఖ‌కు కేటాయించిన డ్రోన్ల‌ ప‌నితీరును ఆయ‌న ప‌ట్ట‌ణ ప‌రిధిలోని కొత్త బైపాస్ రోడ్డులో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ డ్రోన్ల స‌హాయంతో అసాంఘీక కార్య‌క్ర‌మాల‌కు పూర్తిగా అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

ఇప్ప‌టికే పోలీసుశాఖ‌ ట్రాఫిక్‌ రద్దీ క్రమబద్ధీకరణ నుంచి బహిరంగంగా మద్యపానం సేవించడం, పేకాట, అనుమానాస్పద కార్యకలాపాలు వంటి నేరాల కట్టడికి, శాంతి భద్రతల నిర్వహణకు డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారని వెల్ల‌డించారు.

రోడ్డు ప్ర‌మాదాల స‌మ‌యాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయినా ప్రాంతానికి చేరుకుని డ్రోన్ ద్వారా ఏదైనా వాహనం బ్రేక్‌ ఫెయిలైందా.? లేదా యాక్సిడెండ్‌ జరిగిందా? వానకు చెట్టు కూలి రోడ్డుపై పడిందా? అనేది గుర్తించి ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు వినియోగించ‌వ‌చ్చాన్న‌రు.