
మొండి బకాయి దారులు పన్నులు చెల్లింపు హర్షదాయకం…
చిలకలూరిపేట , స్థానిక పట్టణంలోని పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లలో బాగంగా, 2002 సంవత్సరం నుండి నేటి వరకు 2, లక్షల 90 వేల రూపాయలు పన్ను చెల్లించని బకాయి దారులు పన్ను చెల్లించడం హర్షదాయకం అని వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పురపాలక సంఘ ఆర్ఐ గిరిబాబు రెవెన్యూ ఆఫీసర్ పి సుబ్బారావు సచివాలయ సిబ్బంది తదితర పన్నుల వసూళ్ల సిబ్బంది , ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ పీ సుబ్బారావు మాట్లాడుతూ ఆది, సోమ వారం నాడు, ఉగాది రంజాన్ పండుగలు ఉన్నప్పటికీ ఆయా తేదీలలో కూడా పన్నులు కట్టించుకోబడునని దీని కోసం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందనీ కావున పుర ప్రజలు ప్రభుత్వం కల్పించిన 50 శాతం వడ్డీ రాయితీ నీ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేసారు.అదేవిధముగా పట్టణ ప్రజలకు ఉగాది , రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పురపాలక సంఘ సిబ్బంది.
