సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు

TEJA NEWS

సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు

** తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా

తిరుమల: తిరుమలలో సెప్టెంబర్ మాసంలో జరిగే వివిధ ఉత్సవాలు, పర్వదినాల వివరాలను టీటీడీ పీఆర్వో విభాగం అధికారులు తెలిపారు. వాటిలో సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రధానం. 3న విష్ణుపరివర్త నైకాదశి,
సెప్టెంబర్ 4న వామన జయంతి, 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం,
8న మహాలయ పక్ష ప్రారంభం,10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె). 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
21న మహాలయ అమావాస్య, 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం,
28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం, 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం జరగనున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top