Spread the love

43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి ఇంకా ఎంతో కృషి చేయాలి -MLA బొండా ఉమ

సెంట్రల్ నియోజకవర్గంలోని  30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ 3వ లైన్ మెయిన్ రోడ్డు నందు 43 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరోజిని, అనురాధ, నెక్కంటి ప్రసాదుల ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించి టిడిపి జెండాను ఎగురవేసి అనంతరం సర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జండా ఎగరవేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిఠాయిలు తినిపించారు

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది తెలుగు జాతి గర్వానికి, స్వాభిమానానికి ప్రతీక 1982 మార్చి 29న శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి బీజం వేసిన గొప్ప రాజకీయ పార్టీ అని అన్నారు…

అన్న NTR గారు పెట్టిన పార్టీ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెడితే ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి పునాదుల నుండి బలాన్ని చేకూర్చారని,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గుర్తింపు తెచ్చారని, ఈ రోజు మనం 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నామనీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దీర్ఘదృష్టితో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో:- మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు చౌదరి సూర్యనారాయణ, డివిజన్ ఇంచార్జ్ గొట్టుముక్కల శేషం రాజు, కార్యదర్శి లక్కం రాజు శ్రీనివాసరాజు,, వెలగపూడి శ్రీను, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు…