TEJA NEWS

కుల, మత, లింగ, వర్ణాలకతీతంగా ప్రతీ ఒక్కరికి విద్యా, మౌళిక హక్కులకై పోరాడిన గొప్ప సామాజిక వేత్త జ్యోతిరావ్ పూలే : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ డివిజన్ జీడిమెట్ల బస్ డిపో వద్ద జ్యోతిరావ్ పూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. అణగారిన వర్గాలపై కొనసాగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా కుల, మత, వర్గ, లింగ, వర్ణాలకతీతంగా ప్రతీ ఒక్కరికీ విద్యను అందించడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సామాజిక వేత్త జ్యోతిరావ్ పూలే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలతా సురేష్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సూరారం డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, బీసీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కోల రాజు, ప్రధాన కార్యదర్శి ముద్దాపురం మహేష్ యాదవ్, కోశాధికారి కె .సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి మదార్, సలహాదారులు మల్లయ్య, బిఎంఎస్ రాజు, అంజా గౌడ్, నర్సింహులు, ఉమాదేవి, కవిత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.