
పదవ తరగతిలో ప్రతి విద్యార్థి మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యాబోధన జరగాలని ఆదేశించిన……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి జిల్లాలో ప్రతి విద్యార్థి పదవ తరగతిలో మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులో ప్రావీణ్యత మెరుగు పరుచుకునేందుకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.
పిల్లలకు లెక్కలు సులువుగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా బోధించాలి అనే అంశంపై
లెక్కల మాస్టర్లకు మరో ఉపాధ్యాయుడు బోధిస్తుండగా కలెక్టర్ సైతం తరగతి గదిలో కూర్చొని పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థిని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఆ విద్యార్థి పదవ తరగతిలో ఫెయిల్ అయితే ఉపాధ్యాయుడు ఫెయిల్ అయినట్లేనని భావించాలని తెలిపారు. ఈసారి పాఠశాలలో ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థులు ఫెయిల్ అవుతారో అట్టి ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
వనపర్తి జిల్లాలో పదవ తరగతిలో మెథమటిక్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని అందువల్ల మ్యాథమెటిక్ ఉపాధ్యాయులు బోధన పై ప్రత్యేక దృష్టి సారించాలనీ సూచించారు.
విద్యార్థులకు లెక్కలు అర్థమయ్యే విధంగా బోధించాలని విద్యార్థికి లెక్కలు బాగా అర్థమైతే మరే సబ్జెక్టులోను ఫెయిల్ కాడని తెలియజేశారు.
ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు చాలా ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. చేయాల్సింది కేవలం పాఠశాలలో విద్యార్థులకు అంకిత భావంతో బాధ్యతగా బోధించడమే అని గట్టిగా చెప్పారు.
జిల్లా విద్యా అధికారి మహమ్మద్ ఘనీ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
