Spread the love

సీఎం, మంత్రులకు ఈసీ షాక్

TG: రంజాన్ పండగ వేళ.. సీఎం, మంత్రులకు ఈసీ షాకిచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో CM రేవంత్రెడ్డితోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.