Spread the love

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినటం వలన ఆరోగ్యానికి మేలు!

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్ బాబు

నర్సరావుపేట:రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జీరో బడ్జెట్ నేచురల్ పార్మింగ్ (ఎపిసిఎన్ఎఫ్) విధానంలో పల్నాడు జిల్లాలోని రైతులందరూ పంటలను సాగు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలు, తెగుళ్లు, పెరటి తోటల పెంపకం, పుస్తకములు పాంప్లెట్స్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి రసాయన పురుగుమందుల వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కషాయాలు పంటలపై పిచికారి చేసి ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు.

ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలో పండించిన కూరగాయల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయని, అవి తినటం వలన కుటుంబ సభ్యులకు పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ఖాళీగా ఉన్న అంగన్వాడి సెంటర్, స్కూల్లో, పెరటి తోటలు వేసుకో వడం వలన 365 రోజులు విషరహితంగా తీసుకోవచ్చు అని, ఆహారం తీసుకోవడం వలన బాలింతలు, గర్భవంతులు, చిన్నపిల్లల, కిషోర్ బాలికలు, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవటం వలన రైతుకు అదనపు ఆదాయం వస్తుందని, పంటలను సాగు చేసే విధానాన్ని ప్రకృతి వ్యవసాయ రైతులు కలెక్టర్ గారికి తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులందరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమలకుమారి మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ నిర్వహించడం జరిగింది. ఈ స్టాల్ కు (RYSS) రైతు సాధికార సంస్థ పల్నాడు జిల్లాకు మార్కెటింగ్ టెంటు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో, వెలుగు ఆఫీస్ ల వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కావున ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణప్రియ, డిఆర్ఓ మురళి, వ్యవసాయ అధికారి ఐ.మురళి, పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే అమల కుమారి, స్టేట్ ఎన్ఎఫ్ఏ మన్విత, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మేరీ, సౌజన్య, బేబీ రాణి, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.