Spread the love

మార్చు 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన

వెయ్యికోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజలు శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి
వనపర్తి
ముఖ్యమంత్రిని కలిసిన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి , వనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిలు

వనపర్తి లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

వచ్చే నెల మార్చ్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి రానున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

ఈ క్రమంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రాక సందర్భంగా వనపర్తిలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రి కి అందజేశారు

ముఖ్యమంత్రి రాకతో వనపర్తిలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు