TEJA NEWS

విద్యతో పాటు వినయం..విలువలతో కూడిన బోధనతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్ : ప్రత్తిపాటి

  • విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రభుత్వం తల్లికి వందనం, మధ్యాహ్నభోజనం ప్రవేశపెట్టింది : ప్రత్తిపాటి.
  • రాష్ట్ర విద్యార్థులు చదువతో పాటు అన్నిరంగాల్లో రాణించాలన్నదే లోకేశ్ లక్ష్యం : ప్రత్తిపాటి
  • తమ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా విద్యార్థులు తన దృష్టికి తీసుకురావచ్చు : ప్రత్తిపాటి
  • గణపవరం జడ్పీ హైస్కూల్, శ్రీ శారదా హైస్కూల్లో పేరెంట్స్ – టీచర్స్ మెగా మీట్ లో పాల్గొన్న ప్రత్తిపాటి.

రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్న సదుద్దేశంతోనే కూటమిప్రభుత్వం రాష్ఠ్ట్ర విద్యారంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోందని, నూతన విద్యాప్రమాణాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. విద్య ఒక్కటే ముఖ్యం కాదని.. వినయం విలువలతో కూడిన బోధనతోనే విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్, పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ మెగా మీట్ (తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) లో పాల్గొన్నారు.

విద్యార్థులు..తల్లిదండ్రులకు తల్లికివందనం గురించి వివరించిన ప్రత్తిపాటి

తొలుత గణపవరం జడ్పీ హైస్కూల్ కు వెళ్లిన ఆయన అక్కడ దాతల సహకారంతో రూ.35లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ప్రహారీ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థుల..తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశంపై ప్రభుత్వ పనితీరు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేపట్టిన సంస్కరణలపై చర్చించారు. తల్లికి వందనం సాయంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ పథకం యొక్క లక్ష్యాన్ని వారికి వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రధాన వేదికపై నుంచి విద్యార్థులు…తల్లిదండ్రులు… గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర విద్యార్థుల్ని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే లోకేశ్ లక్ష్యం

ఏపీ విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉన్నతంగా రాణించి, మంచి గుర్తింపు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్న సదాశయంతో లోకేశే విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. గురుపౌర్ణమి నాడు విద్యార్థులు.. గురువులు, తల్లిదండ్రుల్ని పూజించి వారి గొప్పతనం తెలుసుకోవాలన్న మంచి ఆలోచనతోనే లోకేశ్ ఈ కార్యక్రమం చేపట్టాడన్నారు.

బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు పడే కష్టాల్ని చూసే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టింది

తమ బిడ్డలకు మంచి భవిష్యత్ అందించాలనే సదుద్దేశంతో తల్లిదండ్రులు నాణ్యమైన విద్యకోసం వేలు..లక్షలు ఖర్చుచేస్తూ ఆర్థికంగా ఇబ్బందులపాలవుతున్నారని, వారి కష్టం గమనించే కూటమిప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ప్రవేశపెట్టిందని ప్రత్తిపాటి తెలిపారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలకు కాస్త అయినా అండగా నిలవాలస్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.13వేల ఆర్థిక సాయాన్ని తల్లులకు అందిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. బిడ్డల కడుపు నింపడం కోసం తల్లిదండ్రులు ఇబ్బందిపడకూడదని నాణ్యమైన భోజనాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తోందన్నారు. విద్యార్థులందరూ తల్లిదండ్రుల కష్టంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో బాగా చదువుకొని పేరుప్రఖ్యాతులు పొందాలని ప్రత్తిపాటి సూచించారు. కేవలం గణపవరంలోని విద్యార్థులకే ప్రభుత్వం రూ.2,52,70,000లతల్లికి వందనం ఆర్థిక సాయం అందించిందని ప్రత్తిపాటి చెప్పారు.
తాము చదువుకునే పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులున్నా విద్యార్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు బాగా పాఠాలు చెప్పకపోయినా.. తాగునీరు, మరుగుదొడ్లు, భోజనంలో ఏమైనా సమస్యలున్నా వెంటనే స్థానిక ఎమ్మెల్యేనైన నాకో.. మండల, జిల్లాస్థాయి అధికారులకో తెలియచేయాలన్నారు.