TEJA NEWS

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎన్నికలపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలైలో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.