
పేట పురపాలక సంఘం సస్పెండ్ అయిన ఉద్యోగులను యధావిధిగా విధుల్లోకి
చిలకలూరిపేట పురపాలక సంఘంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని గంగాభవాని సృష్టించిన ఆర్థిక కుంభకోణంసంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా, వారిలో ఒకరిని తప్ప అందరిని విధుల్లోకి తిరిగి తీసుకున్నారు. అయితే, దీనిపై విచారణ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ సస్పెన్షన్ పర్వంలో మున్సిపల్ మేనేజర్‌గా పనిచేసిన విజయలక్ష్మికి మాత్రం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. ఆమె ప్రస్తుతంసస్పెన్షన్‌లోనేకొనసాగుతున్నారు.
