Spread the love

పట్టణ తాగునీటి సమస్య పై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన మున్సిపల్ చైర్మన్.

వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము:చైర్మన్ షేక్ రఫాని.

చిలకలూరిపేట : పట్టణ ప్రజలకు రోజువారి మంచినీటి సరఫరా జరగాలన్న మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు వారి ఆకాంక్షల మేరకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారని,అనుకున్న సమయానికి సక్రమంగా పనులు పూర్తి అయితే ఈ వేసవి నుండే పట్టణ ప్రజలకు రోజువారి మంచినీటి సరఫరా జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అమృత్ పథకానికి సంబంధించిన ఇంటర్ కనెక్షన్ పనులు మరియు పైప్ లైన్ల లీకేజీ మరమ్మత్తులు పనులు జరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని
మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పేర్కొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదుల పైన మున్సిపాలిటీ పరిధి వార్డుల్లోని తాగునీటి సమస్య పై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.ఏ ఏ వార్డుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరి,తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించామని,అవసరమైన ప్రాంతాల్లో వెంటనే వాటర్‌ పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలన్నారు.వేసవి కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల అమలకు కృషి చేస్తామని వారు తెలిపారు.అధికారులుస్థానిక వార్డు కౌన్సిలర్లను, ప్రజల సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ అబ్దుల్ రహీం, ఏ.ఈ చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.