TEJA NEWS

పర్యావరణ పరిరక్షణ
మహా ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యం.

డాక్టర్ సిహెచ్ భద్ర పిలుపు

ప్రపంచ పర్యావరణ సంస్థ సహాయ కార్యదర్శి A. రాజేష్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాదులోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పర్యావరణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర గారు మాట్లాడుతూ కాలుష్యం నుంచి మానవ సమాజం ఇప్పటికైనా కళ్లు తెరవాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు దేశానికి సేవ చేయాలన్న దైవానికి దగ్గర అవ్వాలన్న పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యమవుతుంది అన్నారు.ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని మనం తినే ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో తీసుకొచ్చుకోవద్దని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగొద్దని దాని మూలంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి రోజు దేశంలో సగటున 26 వేల నుంచి 30 వేల వరకు జనాలు చనిపోతా ఉన్నారు.ప్రపంచంలో యుద్ధాల మూలంగా చనిపోయిన జనాభా కన్నా కాలుష్యం మూలంగా చనిపోతున్న జనాభానే ఎక్కువ అని మనకి అనేక నివేదికలు చెబుతున్నాయి ముఖ్యంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు పర్యావరణం పట్ల పూర్తిగా బాధ్యత లేకపోవడం ప్రకృతిని ప్రకృతి సంపదని అమ్మిన వాళ్లు దోచుకునే వాళ్ళు మాత్రమే నేడు రాజకీయాల్లో ఉండడం మూలంగా ప్రజల జీవితాలు చిందర బంధం అవుతున్నాయి అందరికీ ఉచితంగా ఇవ్వవలసిన స్వచ్ఛమైన నీరు నేడు ప్లాస్టిక్ డబ్బాలలో డబ్బులు ఇచ్చి కొనుక్కొని రోగాలు కొనితెచ్చుకుంటున్నాం ఢిల్లీ ముంబై హైదరాబాద్ లాంటి మహానగరాలు నేడు స్వచ్ఛమైన గాలి దొరకగా అనేక రకాల శారీరక మానసిక రోగాలకు ప్రజలకు గురవుతున్నారు.

వారు సంపాదిస్తున్న సంపాదనలో 50 శాతం సంపాదన హాస్పిటల్ కి ఖర్చు చేయాల్సిన దయనీయమైన స్థితిలో నేడు మానవ సమాజం ఉన్నది అనేక రకాల క్రిమిసంహాకారాలు వాడడం మూలంగా ఆహార పదార్థాలు పూర్తిగా విశతుల్యమైపోతున్నాయి.చివరికి మంచి ఆహారం తినకపోవడం మూలంగా స్వచ్ఛమైన ఆలోచనలు కూడా రాక మనుషులు రోజు మందులతో జీవించాల్సిన దౌర్భాగ్యం దాపురించింది వీటి నుంచి విద్యార్థులు మహా ఉద్యమాన్ని నిర్మించాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా పాల్గొన్న ప్రపంచ పర్యావరణ కార్యవర్గ సభ్యులు టాక్స్ ఫైలింగ్ ఇండియా కంపెనీ సీఈవో శ్రీనివాస్ చెల్లూరి గారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా లక్షలాది మంది విద్యార్థులను ఉపాధ్యాయులను సేవ్ నేచర్ సేవ్ అవర్ ఫీచర్ పేరు మీద ప్లాస్టిక్ వాడొద్దు గుడ్డ సంచలేముద్దు అన్న నినాదంతో ప్లాస్టిక్ దాని అనర్ధాల మీద వందలాది అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరులో ప్రాథమిక స్థాయిలో చైతన్యాన్ని కల్పించి ప్రతిరోజు జీవితంలో పర్యావరణాన్ని పరిరక్షించడం దేవుని సంరక్షించిన విధంగా దేవునికి ప్రతిరూపమే పర్యావరణం ప్రకృతి లేకపోతే ఈ భూమి మీద జీవజాతి లేదు జీవజాతి లేకపోతే మానవజాతి కి మనుగడలేదు అన్ని మతాల గ్రంథాల సారాంశం ప్రకృతి నిజమైన దైవం ప్రకృతిని కాపాడుకోవడం అంటే దేవుని కాపాడుకోవడం దేవుని కాపాడుకుంటే మనమందరం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి
డాక్టర్ ఏ జోశ్నారావు మాట్లాడుతూ విద్యార్థులందరూ తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పర్యావరణ పరిరక్షణను అత్యంత ప్రాధాన్యమైన అంశంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు ప్రతి విద్యార్థి తన విద్యార్థి జీవితంలో కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించి భూమాతకు వెచ్చదనాన్ని తగ్గించి ప్రకృతి ప్రేమికులుగా ప్రకృతి పుత్రురాలుగా జీవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు డి దయానందరావు గారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అంటే సరస్సుల నగరం హైదరాబాద్ నగరం అంటే పార్కుల నగరం కానీ అది ఒకప్పటి మాట నేడు హైదరాబాద్ నగరం అంటే పూర్తిగా మారిపోయింది కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా తయారైంది మూసిలో నీళ్లు నేడు తాగడానికి కాదు కదా చూడడానికి కూడా పనికిరాని విధంగా తయారయ్యాయి ఎంతో అందమైన హుస్సేన్ సాగర్ నేడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన సరస్సుగా అనేక రకాల మందుల ఫ్యాక్టరీల వ్యర్ధాలను విచ్చలవిడిగా శుద్ధి చేయకుండా వదలడం మూలంగా నేడు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు హుస్సేన్ సాగర్ లో ఉన్న జీవజాతి పూర్తిగా దెబ్బ తిన్నది వీటన్నిటిని విద్యార్థులు కాపాడుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ వారదలుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల గీతా గారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ ఉద్యమంలో విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దైవభక్తి దేశభక్తి లక్ష్యాలతో పనిచేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థ లాంటి గొప్ప సంస్థతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చదివిన పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు తేజ, బన్నీ యాదవ్ ,మీనాక్షి గారు తదితరులు పాల్గొన్నారు.