
ఏరువాక పౌర్ణమి – అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025
వేదిక: సుందర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, కొంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.
నవనిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 59 జిల్లాల నుండి ఎంపికైన ఉత్తమ రైతులకు గౌరవప్రదంగా “ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025” కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబు మోహన్ , శ్రీమతి కవిత , డాక్టర్ ఆర్ఎస్ఎస్ , డీ. చక్రపాణి (హార్టికల్చర్ శాఖ), సుందర్ హాజరై కార్యక్రమాన్ని గౌరవించారు.
ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోని ఒక ఉత్తమ రైతును ఎంపిక చేసి, వారికి అగ్రి ఎక్సలెన్స్ అవార్డు, ఎక్సలెన్స్ సర్టిఫికేట్, మరియు ₹2116 నగదు బహుమతిని ప్రధానం చేశారు.
ఈ గౌరవం రైతుల కృషికి, వారి కష్టానికి ఇచ్చే గుర్తింపు.
ఈ సందర్భంగా నవనిర్మాణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పొన్నాన రాంబాబు మాట్లాడుతూ –
మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవకుండా భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
గతంలో ప్రతి గ్రామంలో రైతులు ఎద్దులను పూజించి ఏరు దున్నేవారు. నేటి యువతకు ఆ విశిష్టతను తెలియజేయడమే మా లక్ష్యం.”
డాక్టర్ బాబు మోహన్ మాట్లాడుతూ –
“రైతులు ఐక్యంగా పోరాటాలు చేయాలి. మౌలిక సదుపాయాలపై అవగాహన పెంచుకుని హక్కుల కోసం నిలబడాలి.”
శ్రీమతి కవిత అన్నారు –
“నాకు చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసిన ఈ వేడుక ఎంతో హృద్యంగా ఉంది. ప్రభుత్వ పథకాల సాయంతో ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.”
డాక్టర్ ఆర్ఎస్ఎస్ వివరించారు –
“రీసెర్చ్ ద్వారా వచ్చిన సాగు చిట్కాలను రైతులకు అందిస్తూ సాంకేతికంగా ముందుకెళ్లే మార్గాన్ని చూపించాలి.”
సుందర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ శ్రీ సుందర్ గారు మాట్లాడుతూ –
“ఇటువంటి కార్యక్రమాలు మన విద్యా సంస్థల్లో జరగడం గర్వంగా ఉంది. నేనూ ఒక రైతుగా గర్వపడుతున్నాను. రైతుల హక్కుల కోసం మా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుంది.
చక్రపాణి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ హెచ్ఎండిఏ
ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు గురించి స్కీమ్స్ గురించి వివరిస్తూ వాటిని మంచిగా రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సరిత , విష్ణు గుప్తా , గోవింద్ రెడ్డి , ప్రగతి , మధు , రాకేష్, రవి , ఫణి , సాయి జ్యోతి మరియు ఇతరాలు సహకరించారు.
