
కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా పేద మహిళలకు నిత్యావసర సరుకులు అందించిన హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్య
హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ వారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా డివిజన్ పరిధిలో ఉన్న వృద్ధ నిరుపేద మహిళలకు బియ్యము మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తమ డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు. మా డివిజన్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి అటువంటి వారిలో ఒంటరిగా జీవిస్తూ నిరుపేదలైన వృద్ధ మహిళలను ఎంపికచేసి వారికి బియ్యం మరియు కిరాణా సరుకులు అందించడం జరిగిందని అన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, సమాజసేవ చేయాలనే మంచి ఉద్దేశంతో బృందంగా ఏర్పడి ఎంతోమంది పేదవారి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్న హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది పేదవారికి సహాయసహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో షౌకత్ అలీ మున్నా, వెంకటేశ్వరావు, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
