Spread the love

టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

జర్నలిస్టు కుటుంబాలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

వనపర్తి
టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ) ఏర్పాటుచేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లాలోని జర్నలిస్టులందరు కుటుంబ సమేతంగా సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, మెడికల్ క్యాంపు నిర్వాహకులు బొడ్డుపల్లి లక్ష్మణ్, ద్యారపోగు మన్యం,కుమార్, గంధం దినేష్, తైలం అరుణ్ రాజ్ లు సోమవారం ఒక ప్రకటనలో కోరారు . మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతోనిర్వహించ తలపెట్టిన ఉచితమేగా వైద్య శిబిరం చిట్యాల క్రాస్ రోడ్ లో గల దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని . ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు, 2డి ఎకో, ఈసీజీ, షుగర్, బీపీ, ఎత్తు, బరువు వంటి వైద్య పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుందిని. ఈ మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ హాజరుకానున్నారని బొడ్డుపల్లి లక్ష్మణ్, ద్యారపోగు మన్యం,కుమార్, గంధం దినేష్, తైలం అరుణ్ రాజ్ లు ప్రకటనలో తెలియజేశారు