
రూ.83 లక్షల 80 వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు నేడు శంకుస్థాపన:- PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రేపు అనగా 22/02/2025 శనివారం నాడు ఉదయం 11:00 AM గంటల నుండి PAC చైర్మన్, శేరిలింగంల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి రూ.83 లక్షల 80 వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.
ప్రారంభోత్సవం వివరాలు
- గులమోహర్ పార్క్ కాలనీ లో రూ.14 లక్షల 80 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు
2.నేతాజీ నగర్ కాలనీ లో రూ.20 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు
- గోపన్ పల్లి విలేజ్ CPR బెల్లా విస్టా నుండి నల్లగండ్ల ప్రధాన రహదారి వరకు రూ.49 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకుశంకుస్థాపన చేయడం జరుగుతుంది
కావున గచ్చిబౌలి డివిజన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, పాత్రికేయ మిత్రులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనవి.
ఇట్లు
ఆరెక పూడి గాంధీ,PAC చైర్మన్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
శేరిలింగంపల్లి నియోజకవర్గం
