
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలి ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
2025-2026 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలలో మరిన్ని మెరుగైన వసతుల కల్పనలో భాగంగా, గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలల భవనాలు తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు విద్యుత్ వ్యవస్థ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతి గదుల అవసరం తదితర అంశాలపై సమీక్షించారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందే విధంగా పాఠశాలల్లో అవసరమైన వసతులను కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యా అభివృద్ధి పథకాల అమలును సమర్థవంతంగా విద్యార్థులకు అందిస్తామని పేర్కొన్నారు.
