
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది. అందుకే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది – MLA బొండా ఉమ
సీనియర్లు, జూనియర్లు అని కాకుండా బాగా పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంధి. నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి – MLA బొండా ఉమ
ఉదయం 11:40″ గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర MRPS నాయకులు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని కలసి 61వ డివిజన్ అధ్యక్షుడిగా ఆకుల సూర్య ప్రకాష్ (సూరి) ని ఏకగ్రీవంగా ఎన్నుకొని డివిజన్ అధ్యక్షుల బాధ్యతలు అప్ప చెప్పినందుకు బొండా ఉమా కి ధన్యవాదాలు తెలియజేసి శాలువాతో సత్కరించడం జరిగింది…
ఈ సందర్భంగా MRPS నాయకులు మాట్లాడుతూ:-బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలపాటి పెన్నిధి, దళిత బాంధవుడు MLA బొండా ఉమ ఆకుల సూర్య ప్రకాష్(సూరి) ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం తమ సామాజిక వర్గానికి ఎప్పుడు అండగా ఉంటానని MLA ఇచ్చిన హామీలను నిజం చేశారని…
మాదిగల పట్ల ఆయనకు ఎనలేని గౌరవం అని మరొకసారి రుజువయిందని, భవిష్యత్తులో పార్టీ ఏ పిలుపునిచ్చిన వారికి పూర్తిగా సహకరిస్తామని నిస్వార్ధం,నిజాయితీ,సేవా మనస్తత్వం పరిపూర్ణంగా వున్న MLA బొండా ఉమ గారు అని, నిత్యం ప్రజల కోసం తపిస్తూ ప్రజల మధ్యన ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి బొండా ఉమ అని…
సత్కరించిన వారిలో MRPS నాయకులు:- P. ఎలీషా, నూకపోగు ఏసు, కంపటి వెంకటేశ్వరరావు, లింగాల నరసింహులు, చప్పిడి కాశీ, జనార్దన్, SC సెల్ సెంట్రల్ అధ్యక్షులు నందేటి ప్రేమ్ కుమార్, గడ్డం రాజు, వింజమూరి సతీష్, పరశు నగేష్, భూదాల సురేష్, కంకణాల బాబు తదితరులు పాల్గొన్నారు….
