TEJA NEWS

దేశ నిర్మాణంలో ప్రతీ కార్మికుడి కష్టం, చెమట చుక్కలు ఉన్నాయి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వసుధ ఫార్మా, ఆంధ్ర పాలిమర్స్ పరిశ్రమలలో నిర్వహించిన వేడుకలకు కార్మిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కార్మిక విభాగం జెండాను ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….దేశ నిర్మాణంలో ప్రతీ కార్మికుడి కష్టం, చెమట చుక్కలు ఉన్నాయని, కార్మికుల ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని అన్నారు.

ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ ప్రైవేట్ లిమిటెడ్…
ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు నిర్వహించిన వేడుకల్లో యూనియన్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు డి.అశోక్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసంజిత్ మండల్, జాయింట్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.

వసుధ ఫార్మా యూనిట్ -1 లో…
వసుధ ఫార్మా యూనిట్ -1 లో నిర్వహించిన మే వేడుకల్లో కార్మిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ మోహన్ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రవీణ్, ట్రెజరర్ సత్యనారాయణ రాజు లు పాల్గొని ముఖ్య అతిథులను సత్కరించారు.

ఆంధ్ర పాలిమర్స్ లో…
ఆంధ్రా పాలిమర్స్ నందు నిర్వహించిన మే వేడుకల్లో యూనియన్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై యూనియన్ కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి డి.రసూల్, ఉపాధ్యక్షులు డిఎంసి రమేష్, జాయింట్ సెక్రటరీ పి.రవి కిరణ్, ఆర్గనైజర్ డి. జోగ రావు, ట్రెజరర్ ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి.వివేకానంద్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, మాజీ గ్రంధాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, సూరారం డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, యేసు, నదీమ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.