
అందరి వాడు అంబేద్కర్”
*అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్
అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టం తో పాటు అది ఆయన గొప్పతనం
అంబేద్కర్ జయంతి వేడుకలో
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం-: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలో డప్పులు, కోలాటాలు, భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి, SC వర్గీకరణ జీవో ను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిశేకం నిర్వహించి., సాయిబాబా ఆలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహనీయుల విగ్రహాలకు శంకుస్థాపన చేసి.., బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి., ఎర్పాటు చేసిన సభలో పాల్గొన్న.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, MRPS నాయకులు మాచర్ల సైదులు,స్థానిక కౌన్సిలర్లు, నియెజకవర్గ పరిధిలోని మండాలల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మాట్లాడుతూ..
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి.. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరం దళిత కుటుంబాల్లో సరికొత్త కాంతులు వేలాగడం జరిగింది అని ఆయన అన్నారు..దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రతిభాశాలి …
దళిత బహుజనుల వికాసానికి బాటలు వేసిన భారత రాజ్యాంగ రూపకర్త
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..
