దొంగ ఓట్ల పై ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

TEJA NEWS

దొంగ ఓట్ల పై ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ప్రతి ఓటు విలువైనదే.. ప్రతి పోలింగ్ బూత్ బాధ్యత మనదే

ఎస్ ఐ ఆర్–బి ఎల్ ఏ సమావేశంలో

కోవూరుఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లారాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓట్ల నమోదుపై పార్టీ శ్రేణులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు (బి.ఎల్.ఎ) కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ సమావేశంలో ఆమె మాట్లాడారు.ఓటర్ల జాబితా సవరణఎమ్మెల్యే మార్గదర్శకాల.ప్రతిపక్షాల కుతంత్రాలపై అప్రమత్తంగా ఉండాలి. జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించే ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో నియోజకవర్గంలోని 324 పోలింగ్ బూత్‌ల ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి.బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి ఓట్లను జాగ్రత్తగా గుర్తించి తొలగించాలి.ముఖ్యంగా బలహీనంగా ఉన్న బూత్‌లపై ప్రత్యేక నిఘా పెట్టాలి.ప్రతి కార్యకర్త తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను వ్యక్తిగతంగా పరిశీలించాలి.

ఎక్కడా దొంగ ఓట్లకు తావు లేకుండా చూడాలి.గ్రామాల్లో పెళ్ళై వచ్చిన కొత్త కోడళ్ల పేర్లను, అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్క యువతీ యువకుడిని నూతన ఓటరుగా చేర్చే బాధ్యతను నాయకులు తీసుకోవాలి.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం. గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా బూత్ ఏజెంట్లు, బీఎల్‌ఓలు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ కమిటీలు సమన్వయంతో పనిచేయాలి. సెప్టెంబర్ 20 నాటికి తుది ఓటరు జాబితా విడుదల అవుతుంది.ఈ లోపుగా అప్రమత్తంగా ఉండి జాబితాను సరిచేసుకోవాలి.ప్రతి ఓటూ ఎంతో విలువైనది, ప్రతి పోలింగ్ స్టేషన్ బాధ్యత మనదే అనే భావనతో పని చేయాలి. సమయం తక్కువగా ఉన్నందున అందరూ ఓటరు నమోదు, సవరణపైనే ప్రత్యేక దృష్టి సారించాలి’ అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు.పొదుపు మహానాడు విజయంతాను నియోజకవర్గంలోలేకపోయినా, కష్టపడి కోవూరును పొదుపు మహానాడులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన కార్యకర్తలకు ఎమ్మెల్యే శిరస్సు వంచి నమస్కరించారు.సమస్యల పరిష్కారానికి నేరుగా కలవండిఅని అన్నారు.ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, గాదిరాజు అశోక్, పాలూరు వెంకటేశ్వర్లు, బీద భాస్కరరావు, పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top