
సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.3,39,000/- సిఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 15 చెక్కులను లబ్ధిదారులు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, సీనియర్ నాయకులు ఉట్ల శ్రీహరి, గణేష్ మరియు నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…
