TEJA NEWS

దేవాదాయ భూముల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి

జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి

ఎమ్మార్వో, సీఐ నాగార్జున, ఎంపీడీవోకు, వినతి పత్రం అందజేత

నాగర్ కర్నూలు జిల్లా
కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఉన్న రామగిరి దేవాలయ భూములకు సంబంధించిన గుట్టలను కొంతమంది కాంట్రాక్టర్లు ఇస్టారీతిన ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. ఇట్టి విషయంపై గ్రామస్తులు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బిజెపి నేత తల్లోజు ఆచారి దృష్టికి తీసుకుపోగా ఆయన రామగిరి దేవాలయ భూములను బిజెపి నాయకులతో కలిసి తవ్వుతున్న గుట్టలను పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులు రఘుపతి పేట విలేజి సెక్రెటరీ స్థానిక ఎమ్మార్వో , సీఐ, ఎంపీడీవో వారి కార్యాలయంలో కలిసి వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని, ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు చేసి మట్టిని తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే చూసి చూడనట్లుగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు,దేవాలయ భూములను రక్షించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం స్పందించని యెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గాప్రసాద్ బిజెపి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ జిల్లా కార్యదర్శి నర్సిరెడ్డి రామచంద్ర రెడ్డి నా రెడ్ల శేఖర్ రెడ్డి నరసింహ శ్యాంసుందర్ శ్రీశైలం సురేందర్ గౌడ్ నరేష్ చారి కృష్ణారెడ్డిగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.