
ఎక్సైజ్ దాడుల్లో 600 కేజీల బెల్లం పట్టివేత ఒక కేసు నమోదు ఎక్సైజ్ అధికారి జె, వెంకట్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ పరిధిలో ఎన్ ఫోర్స్ మెంట్ మహబూబ్నగర్, కల్వకుర్తి ఎక్సైజ్ టీంలు, వంగూరు మండలం తిరుమలగిరి తండా, ఎడ్లగడ్డ తాండ, తిప్పారెడ్డిపల్లి తండాలలో నాటుసార తయారీ, నల్ల బెల్లం స్థావరాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు, ఇట్టి దాడులలో తిరుమలగిరి తండాలో నాటు సారా కోసం నిల్వ ఉంచిన 20 బస్తాల నల్ల బెల్లం పొడి, సుమారు 600 కేజీలు, 30 కేజీల పటిక, ఐదు కేజీల నాటు సారా, స్వాధీనం చేసుకున్నారు, పరారీలో ఉన్న నిందితుడు తిరుమలగిరి తండా కు చెందిన మూడవత్ హనుమంతు పై కేసు నమోదు చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారి సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ యొక్క దాడులలో కల్వకుర్తి ఎక్సైజ్ అధికారి సీఐ వెంకటరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్, సి టి, వి వెంకట్ రెడ్డి, సిబ్బంది, జనార్దన్ రెడ్డి, పరశురాం రఘు, తదితరులు ఉన్నారు.
