TEJA NEWS

ఎక్కువ కరెంట్ లోడ్ కోసం త్వర పడండి

సగం ధర చెల్లింపులు చేయండి… అధిక, నాణ్యమైన కరెంట్ తీసుకోండి.

విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయములో గృహవసారాలకు వినియోగించు విద్యుత్ సర్వీసులకు అదనపు లోడు పెంచుకొనుటకు విద్యుత్ శాఖ వారు కిలోవాట్ కు డెవోలోప్మెంట్ చార్జిలలో 50% రాయితీ కల్పించారు.

కనుక మీరు తీసుకొన్న లోడ్ కంటే అధిక లోడు వాడుచున్నచో సమీపంలో వున్న విద్యుత్ రెవిన్యూ కార్యాలయమునందు సంప్రదించండి.

30-06-2025 లోపు అదనపు లోడులో వున్న డెవోలోప్మెంట్ చార్జీ లో 50%రాయితితో లోడుని క్రమబద్దించుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు, సి ఆర్ డి ఏ సర్కిల్ సీనియర్ గణాంకాధికారి అజయ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు విధివిధానాలు ను రూపొందించారు.ఈ కార్యక్రమములో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ గణాంకాధికారి చంద్రశేఖర్ ఏ ఈ లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.