Spread the love

రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య.

వనపర్తి

రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య అన్నారు. శనివారం నియోజకవర్గంలోని పెద్దమందడి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార సమస్త కార్యదర్శి వి. రజని సూచనల మేరకు రైతులకు రైతు చట్టాలు రైతు సంక్షేమ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఉత్తరయ్య ముఖ్యతిథి పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా విత్తన చట్టం 1966 రూపొందించబడిందని తెలియజేశారు అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు MRP ధర కంటే ఎక్కువ అమ్మిన నకిలీ ఉత్పత్తులను అందించిన వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేమాదిరిగ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని లేనిపక్షంలో చెడు వ్యసనాలకు అలవాటుపదటమే కాకుండ వారి బంగారు భవిష్యత్తును బుగ్గి పాలు చేసుకునే ప్రమాదం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవల కొరకు జిల్లా కోర్టు పరిది లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించాలని తెలియజేశారు. మరియు ఎం రఘు మాట్లాడుతూ ఉచిత న్యాయ సలహాలు పొందడం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య రైతులు పనికి ఆహార పథకం కూలీలు తదితరులు పాల్గొన్నారు.