TEJA NEWS
  • రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…..
  • అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుంది…..
  • ప్రభుత్వం అధికారులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
  • ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
  • తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క….


ఏటూరునాగారం మండలం

ఏటూరునగరం మండలం గోగుపల్లి గ్రామంలో లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణనీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తడిసిన ధాన్యాన్నీ కూడా ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుంది…….
ఆరుగాలం కష్టం చేసి రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసిన ముద్ద కావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు
ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది…..
పంట నష్ట పరిహారం ఎంతైనా ప్రభుత్వంమే చెల్లిస్తుంది….
నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఎక్కడెక్కడ వరి ధాన్యం ఉన్న యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు