Spread the love

రైతుల వి ఆత్మహత్యలు కావవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే………… మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోయి రైతులు అరిగోసపడతా ఉన్నారని నీళ్లు ఉంటే కరెంటు లేక కరెంటు ఉంటే నీళ్లు లేక ఈ రెండు ఉంటే ఆర్థిక సహాయం అందక వేసిన పంటలు ఎండిపోయి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇప్పటివరకు 448 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ప్రభుత్వం చిత్తశుద్ధి లేకనే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అవి రైతుల ఆత్మహత్యలు కావని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రులు సమన్వయంతో పనిచేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండేవి కావని 24 గంటలు కరెంటు ఇస్తున్నామని మూడెకరాలలోపు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించామని ప్రగల్భాలు పలకడం తప్ప ఆచరణ లేదని అందుకు ఉదాహరణ వనపర్తి నియోజకవర్గంలోని పెద్దగూడెం తాండ లో పట్ట నష్టపోయిన జులా నాయక్ ఒక ఉదాహరణ అని ఒకవేళ వారు చెప్పిందే నిజమైతే ఇన్ని లక్షల ఎకరాలు ఎలా ఎండిపోయాయో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ప్రశ్నించారు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ఆదుకోవాలని లేదంటే చరిత్ర క్షమించదని దుయ్యబట్టారు నష్టపోయిన పంటను పరిశీలించి రైతు ను పరామర్శించిన నిరంజన్ రెడ్డి వెంట మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం ధర్మానాయక్ కృష్ణా నాయక్ చిట్యాల రాము చంద్రశేఖర్ నారాయణ నాయక్, టీ క్యా నాయక్,రూప్లా నాయక్ తదితరులు ఉన్నారు